తెలంగాణ : ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ భుజానికి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయినట్లు కిమ్స్ మెడికల్ డైరెక్టర్, క్రిటికల్ కేర్ హెచ్‌ఓడీ డా.సంబిత్ సాహు బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డా. ఆర్‌ఎ పూర్ణచంద్ర తేజస్వి, డా.నితిన్ బెజ్జంకి, డా.మధుసూదన్‌రావు, డా.శ్రీనివాస్‌రావు సూరపనేని నేతృత్వంలో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం శస్త్ర చికిత్స చేశారు. ఈ శస్త్ర చికిత్స పూర్తిగా విజయవంతం అయ్యిందని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, రెండు, మూడు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్య బృందం తెలిపింది. ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా, ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’లో నటిస్తున్న విషయం విదితమే.
సర్జరీ సక్సెస్ : ఎన్టీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 04:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)