గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏదో ఒక అంశంపై ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు : రష్మిక

31 నిమిషాల క్రితం

They keep trolling me over one thing or another: Rashmika
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 11:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

హైదరాబాద్ : సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక అంశంపై తనను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారని నటి రష్మిక మందన్న తెలిపారు. ముఖ్యంగా హిందీ సినిమాల్లో దక్షిణాది యాసతో మాట్లాడుతున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపై ఆమె తాజాగా స్పందించారు. తన సహజమైన యాసను తప్పుగా చూడటంలో ఎలాంటి అర్థం లేదని స్పష్టం చేశారు. విజయ్‌ దేవరకొండతో కలిసి 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్‌ షోలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్‌ ఆరంభం నుంచి నటన, భాష, డైలాగులు పలికే విధానం వంటి పలు అంశాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. అయితే ఆ విమర్శల కారణంగా తనకు తాను పరిమితులు విధించుకోవాలని ఎప్పుడూ భావించలేదని చెప్పారు.


దక్షిణాది యాసపై రష్మిక స్పందన ....

'' నేను దక్షిణాది యాసలో మాట్లాడుతున్నానని కొందరు అంటున్నారు. నేను దక్షిణాది నుంచే వచ్చాను. కాబట్టి నాకు ఆ యాస ఉండటం సహజం. అలా కాకుండా మరోలా ఉండాలని ఆశించడం సమంజసం కాదు. సినీ పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటూనే ఉన్నాను. నా నటన, భాష, యాస.. ఇలా దేనినీ వదలకుండా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ, వీటి కారణంగా నా అవకాశాలకు నేనే అడ్డుకట్ట వేసుకోవాలని అనుకోలేదు. ఒక్క భాషకే పరిమితం కావాలని కూడా భావించలేదు'' అని రష్మిక వివరించారు.


డబ్బింగ్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ ....

వేర్వేరు భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు డబ్బింగ్‌ విషయంలోనూ తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని రష్మిక తెలిపారు. తన పాత్రకు మరో డబ్బింగ్‌ ఆర్టిస్టు గొంతు మరింత బాగుంటుందని దర్శకులు భావిస్తే, అందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు తన సినిమాలకు దర్శకత్వం వహించిన వారంతా తనతోనే డబ్బింగ్‌ చెప్పించేందుకు ఆసక్తి చూపారని పేర్కొన్నారు. దర్శకులు నాతోనే డబ్బింగ్‌ చెప్పించాలనుకున్నారు. అది నాకు ఎంతో గొప్పగా అనిపించింది. ఎందుకంటే, ఇన్ని భాషల్లో డబ్బింగ్‌ చెప్పడం చాలా కష్టమైన పని. ఆ బాధ్యతను నేను సమర్థంగా నిర్వహించగలిగితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు'' అని రష్మిక తెలిపారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్