కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న 56వ చిత్రం ‘బత్తా’. బాలాజీ తరుణీతరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. విజయ్ సేతుపతి, బాలాజీ తరుణీతరన్ గతంలో ‘నడువుల కొంచెం పక్కత కానోమ్’, ‘సీతాకాతి’ చిత్రాలకు కలిసి పనిచేశారు. ఈ రెండు చిత్రాల తర్వాత మూడోసారి వీరి కలయికలో ‘బత్తా’ రూపొందుతోంది. దర్శకుడు అట్లీకి చెందిన ఏ ఫర్ ఆపిల్ స్టూడియోస్, ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
విజయ్ సేతుపతి 56వ చిత్రం ‘బత్తా’
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)