సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్యా మారన్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబరు 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహ వేడుక వైభవంగా జరిగినట్లు సమాచారం. సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తదితరులు ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను అనిరుధ్ సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ‘జీవితంలో ఒక్కసారే వచ్చే సందర్భం.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. 11.11’ అంటూ క్యాప్షన్ జోడించారు. నవంబరు 21న చెన్నైలో వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం.









కామెంట్‌లు (0)