mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హీరో అంకిత్ కొయ్య బర్త్ డే పోస్టర్ రిలీజ్

3 గంటల క్రితం

ankit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 09:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూజీ ప్రొడక్షన్ బ్యానర్ లో "సమ్మతమే" ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా "లవ్ జాతర". ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. కంప్లీట్ రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్ టైనర్ గా "లవ్ జాతర" సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు యంగ్ టాలెంటెడ్ హీరో అంకిత్ కొయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ "లవ్ జాతర" సినిమా నుంచి మేకర్స్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ బర్త్ డే పోస్టర్ లో అంకిత్ కొయ్య కొత్త హెయిర్ స్టైల్ తో క్యాజువల్ వేర్ లో క్యూరియస్ గా చూస్తూ కనిపిస్తున్నారు. ఆయన ఈ సినిమాలో త్రివిక్రమ్ అనే క్యారెక్టర్ లో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించనున్నారు. "లవ్ జాతర" చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా..సుజాత సిద్ధార్థ్ డీవోపీగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే మేకర్స్ ఇవ్వబోతున్నారు.


నటీనటులు - అంకిత్ కొయ్య, మానస చౌదరి, తదితరులు


టెక్నికల్ టీమ్


డీవోపీ - సుజాత సిద్ధార్థ్

మ్యూజిక్ - చేతన్ భరద్వాజ్

బ్యానర్ - యూజీ ప్రొడక్షన్స్

పీఆర్ఓ - సురేష్ (ఎస్ కె మీడియా)

మార్కెటింగ్ - హౌస్ ఫుల్

ప్రొడ్యూసర్ - కంకణాల ప్రవీణ

రచన , దర్శకత్వం - గోపీనాథ్ రెడ్డి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్