నేడు దక్షిణాఫ్రికా మహిళలతో కీలక పోరు.. రా.7.00గం.కు
ఓల్ట్‌టఫోర్డ్: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచుల్లో సునాయాసంగా గెలిచిన హర్మన్ ప్రీత్ సేన ఆదివారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో పటిష్ట దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గ్రూప్-ఎలో తొలి లీగ్‌లో పాకిస్తాన్‌పై 64 పరుగుల తేడాతో, రెండో లీగ్‌లో నెదర్లాండ్స్‌పై 95 పరుగుల తేడాతో నెగ్గిన భారతజట్టు.. హ్యాట్రిక్ గెలుపుపై దృష్టి సారించింది. మరోవైపు దక్షిణాఫ్రికా మహిళలు తొలి లీగ్‌లో ఆస్ట్రేలియాపై 65 పరుగుల తేడాతో ఓడినా.. రెండో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 2 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే గెలుపు తప్పనిసరి. గ్రూప్-ఎలో శనివారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 23 పరుగుల తేడాతో పాకిస్తాన్ మహిళలపై విజయం సాధించింది.
బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేయగా.. అనంతరం పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 100 పరుగులే చేసింది. ఇక గ్రూప్-బిలో ఆస్ట్రేలియా మహిళల జట్టు 98 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ మహిళలపై గెలిచింది. ఆస్ర్టేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేస్తే.. నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 121 పరుగులే చేసింది.









కామెంట్‌లు (0)