mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టైటిల్‌ ‌ కొట్టేదెవరో..?

3 గంటల క్రితం

team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 12:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నేడు భారత్‌-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య కీలక పోరు

ఉ. 10.00 గం.లకు

దంబుల్లా: ముక్కోణపు సిరీస్‌ ఫైనల్ మ్యాచ్ దంబుల్లా వేదికగా ఆదివారం జరగనుంది. భారత్‌- శ్రీలంక జట్ల మధ్య జరిగే టైటిల్‌ పోరులో టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక- ‘ఎ’ జట్టు కెప్టెన్‌ సహాన్‌ అరాచిగే భారత స్టార్‌ వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఫైనల్లో అతడిని టార్గెట్‌ చేయబోమని స్పష్టం చేశాడు. కాగా శ్రీలంక- భారత్‌ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌ ‘టై’ కాగా.. సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఇందులో శ్రీలంక విజయం సాధించగా.. ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే లంక ప్లేయర్‌ కవ్వింపు చర్యలకు దిగగా.. వైభవ్‌ సూర్యవంశీ అతడి మీదకు దూసుకువెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అంపైర్‌ వచ్చి ఆటగాళ్లను విడదీశాడు. భారత్‌తో పోటీ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు శ్రీలంక కెప్టెన్ తెలిపాడు. కాగా లీగ్‌ దశలో తొలుత శ్రీలంకపై భారత్‌ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కగా.. రెండో మ్యాచ్‌లో లంక సూపర్‌ ఓవర్లో విజయం సాధించింది. ఇక ఇరుజట్లు అఫ్గానిస్తాన్‌పై గెలుపుతో ఫైనల్లో అడుగుపెట్టాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్