mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాతో నేను ఎక్కువ సమయం గడపాలని...

2 గంటల క్రితం

lohar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 12:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నటి కయ్యదు లోహర్‌ సోషల్ మీడియాకు బ్రేక్ ప్రకటిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘నేను సోషల్ మీడియా నుండి కొద్దికాలం పాటు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. సాధారణంగా మనం అలసిపోయినప్పుడు మన శరీరానికి ఎలాంటి విశ్రాంతిని ఇస్తామో.. అలాగే మన మనసుకు కూడా కొన్నిసార్లు ప్రశాంతత, విశ్రాంతి చాలా అవసరం. అందుకే నా జీవితంలో కాస్త నెమ్మదించాలని, కొంతకాలం పాటు ఈ డిజిటల్ ప్రపంచానికి దూరంగా జరగాలని అనుకుంటున్నాను. తెర వెనుక ఉన్న నా అసలు జీవితంతో, నాతో నేను ఎక్కువ సమయం గడపాలని భావిస్తున్నాను. ఇప్పటివరకు నాకు ఇక్కడ ఎంతో మద్దతునిచ్చి, ప్రోత్సహించి, ప్రేమను పంచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ సందేశాలు, మీరు చూపించిన ప్రేమ నాకు ఎంతో విలువైనవి’ అని పోస్టులో రాశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్