mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి..

2 గంటల క్రితం

prabhash
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 12:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ సినిమా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ప్రభాస్ తన అభిప్రాయాలను నిర్మాత నాగ్ అశ్విన్‌తో ఫోన్‌లో పంచుకున్నారు. ‘సింగీతం గారు జీనియస్. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా. మొదటి నుంచి చివరి వరకు నన్ను బాగా ఆకట్టుకుంది. సినిమాలో హీరో చెట్టు దగ్గరికి వెళ్లే ఒక ఎమోషనల్ సీన్ చూసినప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. గతంలో “మయూరి”లో ఎలాంటి భావోద్వేగాన్ని పండించారో, ఇందులోనూ పాటల ద్వారానే అదే స్థాయిలో హృదయాలను తాకారు’ అని ప్రభాస్ అన్నారు. అలాగే సింగీతం గారికి వాయిస్ మెసేజ్ పంపిస్తూ, ‘సార్, ఇప్పుడే సినిమా చూశాను. యు ఆర్ ది గ్రేటెస్ట్ ఎవర్ సార్.. హ్యాట్సాఫ్’ అని అభినందించారు.

సినిమా మొత్తం సంభాషణలు లేకుండా కేవలం పాటలతోనే సాగడంపై ప్రభాస్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా, నాగ్ అశ్విన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘సాధారణంగా ముందుగా ట్యూన్ చేసి, తర్వాత సాహిత్యం రాస్తారు. కానీ సింగీతం గారు మొదట డైలాగుల్లా లిరిక్స్ రాసి, వాటికి తర్వాత ట్యూన్ చేశారు. ఒకటిన్నర గంటల నిడివి ఉన్న మొత్తం కథను ఆయనే పాడుతూ నరేషన్ పంపించారు. మొదట్లో మాకు ఈ విధానం అర్థం కాలేదు. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఆ సన్నివేశాలను విడదీసి అద్భుతమైన సంగీత రూపం ఇచ్చారు. ఈ సినిమాకు సింగీతం గారితో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా అంతే కీలకం’ అని చెప్పారు. ప్రస్తుతం వీరి ఫోన్ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్