సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కదిరి కాళిదాస్‌’గా...

1 గంట క్రితం

chiru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 08:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాకా’. ఈ సినిమాలో చిరంజీవి పోషిస్తున్న పాత్ర పేరు ‘కదిరి కాళిదాస్‌’ అని చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ఫస్ట్‌లుక్‌లో చిరంజీవిని విభిన్నమైన మాస్‌ లుక్‌లో చూపించారు. ఆయన పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం దశలవారీగా వెల్లడిస్తోంది. చిరంజీవి ఇమేజ్‌కు అనుగుణంగా యాక్షన్‌, కుటుంబ భావోద్వేగాలు, వినోదానికి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ‘కదిరి కాళిదాస్‌’ పాత్ర స్వభావం, కథలో దాని ప్రాధాన్యం ఏమిటనేది ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. ఈ సినిమాను సంక్రాంతి 2027 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్