శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​జైస్వాల్‌ సెంచరీ

14 నిమిషాల క్రితం

yaswanth
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 09:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇండియా-ఎ 227/2

- న్యూజిలాండ్‌-ఎతో అనధికారిక టెస్ట్‌

లింకోలిన్‌: న్యూజిలాండ్‌-ఎతో జరుగుతున్న మూడో, చివరి అనధికారిక టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ సెంచరీతో రాణించాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి ఇండియా-ఎ జట్టు 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు జైస్వాల్‌, సాయి సుదర్శనర్‌ తొలి వికెట్‌కు ఏకంగా 175 పరుగులు జతచేశారు. ధాటిగా ఆడిన జైస్వాల్‌ కేవలం 138 బంతుల్లో 16ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఫోర్స్‌ బౌలింగ్‌లో పాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు. ఆ తర్వాత పడిక్కల్‌(15) నిరాశపరిచినా.. కెప్టెన్‌ జురెల్‌(12నాటౌట్‌) జైస్వాల్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా క్రీజ్‌లో కుదురుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్