mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘ధర్మన్‌’ ద డెడ్లీ డాక్టర్‌ వస్తున్నారు..

3 గంటల క్రితం

rajini
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 08:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

కమల్ హాసన్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై రూపొందుతోన్న రజనీకాంత్ 173వ సినిమా టైటిల్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ధర్మన్’ (Dharman - The Deadly Doctor) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సిమ్రాన్, రాశీ ఖన్నా కథానాయికలుగా కనిపించనున్నారు. ‘ధర్మమే గెలుస్తుంది’ అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ, ‘మొదట ఈ చిత్రాన్ని దర్శకుడు రవికుమార్‌తో చేయాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. తర్వాత సుందర్‌ను ఎంపిక చేశాం. ఆయనకు ఇతర ప్రాజెక్టులు ఉండడంతో వైదొలిగారు. ఆ తర్వాత శిబి చక్రవర్తిని ఖరారు చేశాం. ఆయన మాకు వేరే కథ వినిపించారు. చివరకు అశ్వత్ మారిముత్తుతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని వెల్లడించారు. కమల్ హాసన్ రజనీతో కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. ‘ఒకప్పుడు ఏవీఎం స్టూడియోలోని వేపచెట్టు కింద కూర్చున్న ఇద్దరు యువకులు ఇంత దూరం ప్రయాణించడం గర్వంగా ఉంది. మేం విజయం సాధిస్తామని నమ్మి ముందుకు సాగాం. ఈ స్థాయిలో అగ్రకథానాయకులుగా మారతామని ఊహించలేదు. సాధారణంగా సినిమా పనుల్లో హీరో రిలాక్స్‌డ్‌గా ఉంటే నిర్మాత హడావుడి చేస్తారు. కానీ ఈ చిత్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రకటించిన నాటి నుంచి అందరికీ ఫోన్ చేస్తూ, తాను కమల్ హాసన్ నిర్మాణంలో నటిస్తున్నానని చెబుతూ రజనీకాంత్ ఎవరినీ నిద్రపోనివ్వడం లేదు’ అని అన్నారు. చిత్రం ప్రకటించగానే రజనీకాంత్ తనకు ఓ వాయిస్ నోట్ పంపారని దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలిపారు. ‘ఒక స్టార్ హీరో నిర్మిస్తున్న చిత్రంలో మరో స్టార్ హీరో నటిస్తున్నారు. చరిత్రలో గుర్తుండిపోయే చిత్రం ఇది. దీనికి దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో ఎనిమిది పాటలు ఉంటాయి. అన్నీ భిన్నంగా అనిపిస్తాయి’ అని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్