mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘హైకూ’ చిత్రీకరణ పూర్తి

2 గంటల క్రితం

hiku
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 09:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

'కోర్టు' ఫేమ్ శ్రీదేవి, 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్, ఏగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బహుభాషా చిత్రం 'హైకూ' చిత్రీకరణ పూర్తయింది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి కథ, దర్శకత్వం వహిస్తున్నారు. నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల పాటు సాగిన చిత్రీకరణ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు యువరాజ్ చిన్నసామి మాట్లాడుతూ, "ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే భావోద్వేగ చిత్రంగా 'హైకూ'ను రూపొందిస్తున్నాం. మంచి థియేట్రికల్ అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది" అని తెలిపారు. చిత్రీకరణ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషమని నిర్మాతలు తెలిపారు. దర్శకుడి కథపై ఉన్న స్పష్టత, మేకింగ్‌లో చూపిన నిబద్ధత వల్ల సినిమా అద్భుతంగా వచ్చిందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్