mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడలో విమాన ఇంధన ఉత్పత్తి కేంద్రం

2 గంటల క్రితం

oil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 45 ఎకరాలు కేటాయింపునకు నిర్ణయం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి: కాకినాడలో సుస్థిర విమాన ఇంధనం తయారీ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్ఎఎఫ్‌వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సుమారు 45 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డు ద్వారా కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ సంస్థ నుంచి రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీకి ప్రతిపాదనలొచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం భూ కేటాయింపు మార్గదర్శకాలు–2026 మేరకు కాకినాడలో సుమారు 45 ఎకరాలను సంస్థకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ భూమిని సంస్థతో 30 ఏళ్ల దీర్ఘకాల లీజు ఒప్పందం మేరకు సంస్థకు అప్పగించనున్నారు. లీజు అద్దెతో పాటు ఇతర వర్తించే రుసుములు అప్పటికి అమల్లో ఉన్న షెడ్యూల్ అఫ్ రేట్స్ ప్రకారం వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంబంధిత అన్ని చట్టబద్ధ అనుమతులు, క్లియరెన్సులు, ఇతర అవసరమైన ఆమోదాలను సంబంధిత అధికారుల నుంచి సంస్థ పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భూమి కేటాయింపు జరిగిన తేదీ నుంచి 15 నెలలలోపు అభివృద్ధి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, సుస్థిర విమాన ఇంధన తయారీ రంగంలో పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభించనుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్