mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

1,400 గ్రాముల గంజాయి స్వాధీనం

2 గంటల క్రితం

ganja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు, ముగ్గురు యువకులు అరెస్ట్

పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం నరసరావుపేట మొదటి పట్టణ సిఐ ఫిరోజ్ కథనం ప్రకారం... పట్టణంలోని ప్రకాష్ నగర్ అంధుల ఉన్నత పాఠశాల వద్ద 1,400 గ్రాముల గంజాయిని, ఇద్దరు బిటెక్ విద్యార్థులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధిలోని ఒక కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన సింహాచలం అలియాస్ వినోద్ గంజాయిని తీసుకొచ్చి మండలంలోని మరో కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న కృష్ణా జిల్లాకు చెందిన సాయినాథ్‌కు విక్రయిస్తుండేవాడు. ఈ నేప‌థ్యంలో సింహాచలంకు ఇన్‌స్టా‌గ్రామ్‌‌లో గుంటూరుకు చెందిన జావేద్, రహంతుల్లా, అతావుల్లాలు పరిచయమయ్యారు. ఈ ముగ్గురూ సింహాచలం వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. గంజాయి కొనుగోలు కోసం సింహాచలం వద్దకు ఈ నలుగురు రాగా ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సిఐ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్