రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న 'టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమాతో రేపు (ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాక్సిక్’ విడుదలకు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కొద్ది సేపటికే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమాకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం ‘టాక్సిక్’ సినిమా టికెట్ ధరలను 10 రోజుల పాటు పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.50 వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘టాక్సిక్’ విడుదల రోజున అభిమానుల కోసం ప్రత్యేకంగా ఉదయం 6 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతి లభించింది. ఈ ప్రత్యేక షోల టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘టాక్సిక్’పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్‌కు భారీ హైప్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 09:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)