గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడబ్బు కోసమే సినిమాల్లోకి వచ్చా: విజయ్ సేతుపతి

5 గంటల క్రితం

Vijay Sethupathi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 09:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నటన అంటే తనకు మొదట్లో ఇష్టం లేదని, ఆర్థిక అవసరాల కోసమే సినిమాల్లోకి వచ్చానని నటుడు విజయ్ సేతుపతి అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన బాల్యం, కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. "మా నాన్న మా కోసం చాలా అప్పులు చేశారు. అప్పులు ఇచ్చినవాళ్లు ఒక్కోసారి ఇంటిపైకి వచ్చేవారు. ఆ సమయంలో ఆయన ఒంటరిగా బాధపడకూడదని ఎప్పుడూ ఆయన పక్కనే కూర్చునేవాడిని. ఎన్ని కష్టాలున్నా మా నాన్న రోజూ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి మాతో కలిసి తినేవాడు. ఆ జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేను" అని చెప్పారు. "చిన్నతనంలో కూలి పనికి వెళ్లాను. సినిమాల్లోకి రాకముందు దుబాయ్‌లో అకౌంటెంట్‌గా, రిటైల్ స్టోర్‌లో సేల్స్‌మ్యాన్‌గా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో క్యాషియర్‌గా, ఫోన్ బూత్ ఆపరేటర్‌గా పనిచేశాను. దుబాయ్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాటక రంగంతో పరిచయం ఏర్పడి సినిమాల్లోకి వచ్చాను" అని తెలిపారు. ప్రస్తుతం ఆయన నటించిన 'ట్రైన్', 'స్లమ్ డాగ్' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్