బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడాక్టర్ ప్రియాంక మృతిపై విచారణ జరిపించాలి: సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్

1 గంట క్రితం

cpmlogo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 12:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజమహేంద్రవరంలో ఈ నెల 3వ తేదీ రాత్రి మద్యం సేవించి కొందరు దుండగులు పలుమార్లు కారుతో ఢీ కొట్టించి దారుణంగా హత్య చేసిన ఘటనలో డాక్టర్‌ ప్రియాంక తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సిసిటివి దృశ్యాల ప్రకారం మద్యం మత్తులో ఉన్న నిందితులు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడుపుతూ ప్రియాంకను పలుమార్లు ఢీకొట్టారని తెలిపారు. ప్రమాదానికి ముందు కూడా ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగినట్లు సిసి కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. అలాంటి నేపథ్యంలో ఈ ఘటనను కేవలం రోడ్డు ప్రమాదంగా పరిగణించడం సరైంది కాదని, నిందితుల వెనుక పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులున్నారని, వారు కేసు నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే వార్తలొచ్చాయని విమర్శించారు.

రాజమండ్రిలో ప్రజా సంఘాలు, పౌర సమాజం స్పందించి ఆందోళన చేశాకే నిందితులపై హత్యకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, ఇందులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

ఘటన జరిగిన రెండు రోజుల తరువాత సోషల్ మీడియా ద్వారా వెలుగులోకొచ్చాక మాత్రమే పోలీసులు ప్రెస్‌మీట్ నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారని, సమాచారం బయటకు రాకుండా తొక్కి పెట్టారనేది అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఈ మొత్తం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి ప్రకటించిన సహాయం సక్రమంగా లేదని, ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించడం సరిపోదని, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు. ప్రత్యేకంగా డాక్టర్‌ ప్రియాంక మృతి ఘటనపై పూర్తి స్థాయిలో, పారదర్శకంగా విచారణ జరిపించి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్