నాకౌట్ మ్యాచ్‌ల స్థానంలో మరోసారి వర్గీకరణ మ్యాచ్‌లు
భువనేశ్వర్: హాకీ ప్రపంచ కప్-2026లో భారత్ ఈసారి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ ఏడాది జరిగే ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌కు భారత పురుషుల, మహిళల హాకీజట్లు అర్హత సాధించడం విశేషం. ఆగస్టు 15 నుంచి బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. 30న జరిగే ఫైనల్‌తో 2026 హాకీ ప్రపంచకప్ టోర్నీ ముగియనుంది. భువనేశ్వర్‌లో జరిగిన 2023 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న జర్మనీ, పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. ఇక మహిళల విభాగంలో ఆతిథ్య నెదర్లాండ్స్ జట్టు తమ సొంత గడ్డపై వరుసగా రెండోసారి ప్రపంచకప్ టైటిల్‌ను కొట్టేందుకు సిద్ధమైంది. నెదర్లాండ్స్ మహిళల జట్టు ఇప్పటివరకు తొమ్మిది సార్లు (1974, 1978, 1983, 1986, 1990, 2006, 2014, 2018, 2022) ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
కొత్త ఫార్మాట్ ఇలా...
గతంలో 16జట్లను నాలుగు పూల్స్‌గా విభజించి ప్రతి పూల్‌లో టాప్-2లో నిలిచి 8జట్ల మధ్య క్వార్టర్‌ఫైనల్(నాకౌట్) మ్యాచ్‌లు జరిగేవి. అలాగే ప్రతి పూల్‌లో 3, 4 స్థానాల్లో నిలిచిన 8జట్లు వర్గీకరణ మ్యాచ్‌లకే పరిమితమయ్యేవి. కానీ 2026 ఎడిషన్‌లో ప్రారంభ దశ తర్వాత ఒక ప్రధాన మార్పు చోటు చేసుకుంది. ఇందులో క్వార్టర్ ఫైనల్స్(నాకౌట్) మ్యాచ్‌లు ఉండవు. దానికి బదులుగా టైటిల్ పోరులో నిలిచే 'క్రాస్‌ఓవర్ పూల్స్'లోని అగ్రశ్రేణి రెండు జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. అంటే ప్రతి పూల్‌లో టాప్-2లో నిలిచిన 8జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. వీటికి గ్రూప్ ఇ, ఎఫ్ లుగా విభజించారు. ఇలా నాలుగేసి జట్లు రెండు గ్రూపుల్లో మూడేసి మ్యాచ్‌లు ఆడి టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడతాయి. క్రాస్ ఓవర్‌లో ప్రతి గ్రూప్‌లో 3, 4 స్థానాల్లో నిలిచిన 8 జట్లు కూడా రెండు పూల్స్‌గా విభజించి మూడేసి మ్యాచ్‌లు ఆడతాయి. క్యారీ-ఓవర్ నియమం మొదటి దశకు మరో స్థాయి ప్రాముఖ్యతను సంతరిస్తుంది. ఎందుకంటే ఒకే పూల్ నుంచి అర్హత సాధించిన రెండు జట్ల మధ్య హెడ్-టు-హెడ్ ఫలితం రెండవ దశ స్టాండింగ్స్‌ను ప్రభావితం చేస్తుంది.
క్రాస్‌ఓవర్ పూల్స్...
ప్రారంభ పూల్ దశ ముగిసిన తర్వాత, మొదటి రౌండ్‌లో జట్లు సాధించిన స్థానాల ఆధారంగా వాటిని నాలుగు కొత్త పూల్స్‌గా పునర్వ్యవస్థీకరిస్తారు. క్రాస్‌ఓవర్ పూల్స్ ఇలా ఉంటాయి
తొలి దశ పూల్ లీగ్ మ్యాచ్‌లు ముగిసిన అనంతరం...
పూల్-ఇ: పూల్ ఎ, డి లలో మొదటి మరియు రెండో స్థానాల్లో నిలిచిన జట్లు
పూల్-ఎఫ్: పూల్ బి, సి లలో మొదటి మరియు రెండో స్థానాల్లో నిలిచిన జట్లు
పూల్-జి: పూల్ ఎ, డి లలో మూడో మరియు నాల్గో స్థానాల్లో నిలిచిన జట్లు
పూల్-హెచ్: పూల్ బి, సి లలో మూడో మరియు నాల్గో స్థానాల్లో నిలిచిన జట్లు







కామెంట్‌లు (0)