నటి సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. మహిళా ప్రధాన కథాంశంతో రూపొందిన చిత్రానికి ఈ స్థాయి ఆరంభం లభించడం విశేషంగా భావిస్తున్నారు. సినిమాకు వస్తున్న స్పందనపై సమంత ఆనందం వ్యక్తం చేశారు. మంచి కంటెంట్ ఉంటే హీరో, హీరోయిన్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని ఆమె అన్నారు. గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
‘మా ఇంటి బంగారం’కు మంచి వసూళ్లు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 11:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)