mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'రాకా' కొత్త షెడ్యూల్‌లో రష్మిక

2 గంటల క్రితం

rashmi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 09:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాకా' చిత్రంలో రష్మిక మందన్న మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. త్వరలో ముంబైలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో ఆమె పాల్గొననున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే దీపికా చిత్రీకరణలో పాల్గొనగా, తాజా షెడ్యూల్‌లో రష్మికతో పాటు మృణాల్, జాన్వీలకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ సుమారు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్