నటుడు రవితేజ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ కానున్నారు. ప్రస్తుతం ‘ఇరుముడి’ చిత్ర షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసిన ఆయన, మరో రెండు ఆసక్తికరమైన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘రాజా ది గ్రేట్’ తర్వాత నిర్మాత దిల్ రాజుతో ఆయన కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభం కానుంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు వివేక్ ఆత్రేయతో మరో మాస్ ఎంటర్‌టైనర్ చేయడానికి రవితేజ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల షూటింగ్‌లను ఒకేసారి నిర్వహించేలా తన డేట్లను ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మరో రెండు ప్రాజెక్టుల్లో రవితేజ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 12:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)