హర్షిత్ రెడ్డి, విశాక ధీమన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రోమియో-జూలియట్’ విడుదల తేదీ మారింది. భార్గవ మాచర్ల దర్శకత్వంలో నవరస ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తొలుత అక్టోబర్ 23న విడుదల చేయాలని భావించారు. అయితే, కొన్ని కారణాలతో వాయిదా పడింది. తాజాగా అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘కొత్త తేదీ.. అదే ఉత్సాహం.. వెండితెరపై సందడి చేసేందుకు ‘రోమియో-జూలియట్’ వస్తోంది. తేదీ గుర్తుంచుకోండి’ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
30న ‘రోమియో-జూలియట్’
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 06:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)