ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను తీర్చేందుకు అనకాపల్లి జిల్లా గోవాడలోని చోడవరం సహకార చక్కెర కర్మాగారానికి రూ.28.43 కోట్ల రుణం మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024-25 చెరకు క్రషింగ్ సీజన్కు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన చెరకు ధర బకాయిల కోసం ఈ మొత్తాన్ని కేటాయించింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేటాయింపుల నుంచి రూ.28.43 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతి ఇచ్చింది. గోవాడ చోడవరం కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్ ద్వారా రైతులకు చెల్లించాల్సిన చెరకు ధర బకాయిలను తీర్చేందుకు ఈ రుణాన్ని వినియోగించనున్నారు. నిబంధనల ప్రకారం రీయింబర్స్మెంట్ విధానంలో నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాన్ని గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు, నిర్దేశించిన నిబంధనల ప్రకారం తిరిగి వసూలు చేయనున్నారు. ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం ప్రభుత్వం ఈ పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది.
చెరకు రైతుల బకాయిల చెల్లింపునకు రూ.28.43 కోట్ల రుణం
57 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 16, 2026, 09:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)