తమిళ హాస్యనటుడు, కథానాయకుడు సంతానం ప్రధాన పాత్రలో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కు ‘అతిశయ పిరవి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. సుధామన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వీనస్ ఇన్ఫోటైన్‌మెంట్, కే7 స్టూడియోస్ పతాకాలపై కేజే గణేష్, విజయ్ కే సెల్లియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే టీజర్, ట్రైలర్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించనున్నారు.
‘అతిశయ పిరవి’గా సంతానం కొత్త చిత్రం
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 24, 2026, 07:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)