mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సర్కారు బాయి’ బర్త్‌డే పోస్టర్ విడుదల

2 గంటల క్రితం

movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 10:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీరామ్ నిమ్మల, వర్షిక జోడీగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు బాయి’. డెక్కన్ ఫిలింస్ సమర్పణలో తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకుడు. తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబించే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం బర్త్‌డే పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో తెలంగాణ పల్లె యువకుడి పాత్రలో శ్రీరామ్ నిమ్మల కనిపించారు. ఈ నెల 17 నుంచి చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి గ్రామంలో చిత్రీకరణ కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ నిమ్మల, వర్షిక, బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్‌లపై పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జూలై నెలాఖరు వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్