వాషింగ్టన్ : అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ వెల్‌టవర్ సిఇఒగా వ్యవహరిస్తున్న భారతీయ మూలాలున్న శంఖ్ మిత్ర ప్రపంచంలోనే రెండో అత్యధిక పారితోషికం పొందుతున్న సిఇఒగా గుర్తింపు పొందారు. 2025 సంవత్సరానికి గాను ఆయన సుమారు రూ.7,000 కోట్ల (821 మిలియన్ డాలర్లు) వేతనాన్ని అందుకున్నారు. ఇందులో 99 శాతం స్టాక్ అవార్డుల రూపంలోనే ఉండటం విశేషం. కోల్‌కతాకు చెందిన శంఖ్ మిత్ర.. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, కొలంబియా బిజినెస్ స్కూల్‌లో ఎంబిఎ పూర్తి చేసి 2016లో వెల్‌టవర్ సంస్థలో చేరారు. పదేళ్లలో పబ్లిక్ కంపెనీ సిఇఒలకు లభించిన అత్యంత భారీ వేతన ప్యాకేజీల్లో ఇది ఒకటిగా నిలవగా.. ఈ జాబితాలో టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు.
వెల్‌టవర్ సిఇఒకు రూ.7000 కోట్ల వేతనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)