mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రూ.18 వేల కోట్ల పిఎస్‌‌యుల వాటాల విక్రయం

1 గంట క్రితం

dis investments
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మూడు నెలల్లోనే..

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని మోడీ సర్కార్‌ ‌ వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 జూన్‌‌తో ముగియనున్న తొలి త్రైమాసికంలో ఇప్పటి వరకు రికార్డ్‌ ‌వాటాలను విక్రయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఊహించని స్థాయిలో రూ.18,000 కోట్లను కేంద్రం తన ఖజానాలో వేసుకుంది. గతేడాది ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.16,886 కోట్లుగా నమోదయ్యింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌‌సి)లో 2 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ ఒక్క లావాదేవీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ రాబడి రూ.18,000 కోట్ల మార్కును దాటింది. ​ఈ విషయంపై డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ కార్యదర్శి అరుణిష్ చావ్లా ఎక్స్ వేదికగా ఐర్‌ఎఫ్‌సి ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్‌) పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహాన్ని చూపారని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వాటాల విక్రయ ప్రక్రియలో సంస్థాగత, రిటైల్ పెట్టుబడిదారులు కలిపి మొత్తం 22.88 కోట్ల షేర్లను కొనుగోలు చేశారని.. దీని ద్వారా సుమారు రూ.2,084 కోట్ల ఆదాయం సమకూరిందని ఆయన వివరించారు.గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వానికి ఇంత భారీగా ఆదాయం లభించడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్