mh ad
శనివారం, 20 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మా చిత్రం విడుదల ఆగిపోయింది!

3 గంటల క్రితం

spirit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 11:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ చిత్రం టైటిల్ వివాదం నేపథ్యంలో మహిళా రైతు, నిర్మాత నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్పిరిట్ ఈజ్ నాట్ వన్’ పేరుతో తాము ఇప్పటికే చిన్న చిత్రాన్ని నిర్మించి, సెన్సార్ సర్టిఫికేట్ కూడా పొందామని తెలిపారు. ‘టీ-సిరీస్ సంస్థ నుంచి రెండు లీగల్ నోటీసులు రావడంతో మా సినిమా విడుదల నిలిచిపోయింది. స్పిరిట్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కాకముందే మా సినిమా ప్రచారం జరిగింది. మమ్మల్ని ఒకసారి సంప్రదించి ఉంటే టైటిల్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్లం. కానీ చర్చలు లేకుండానే నోటీసులు పంపడం వల్ల తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాం’ అని పేర్కొన్నారు. ‘సినిమా కోసం ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. విడుదల ఆగిపోవడంతో అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చింది.’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టైటిల్ విషయంలో అభ్యంతరాలు ఉంటే పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కారం కనుగొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తమ చిత్రం విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని టీ-సిరీస్ అధికారికంగా లేఖ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్