‘మద్రాస్’, ‘కబాలి’, ‘సార్పట్ట పరంపర’, ‘తంగలాన్’ వంటి సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పా. రంజిత్. తాజాగా ఆయన దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘వెట్టువం’ తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ‘వరల్డ్ ఆఫ్ వెట్టువం’ పేరుతో రూపొందించిన ప్రత్యేక పరిచయ వీడియోను సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్య, అట్టకత్తి దినేష్, శోభితా ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. విభిన్న కాలమానాలతో కూడిన కథాంశంతో, సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
నేడు ‘వెట్టువం’ ప్రత్యేక వీడియో
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 06:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)