ప్రముఖ సినీ ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ అకాడమీ) నుంచి ఆహ్వానం అందింది. దీంతో ఆయన అకాడమీ సభ్యుడిగా చేరడంతో పాటు ఆస్కార్ నామినేషన్లు, విజేతలను నిర్ణయించే ఓటింగ్ హక్కు పొందనున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానం ఉన్న శ్రీకర్ ప్రసాద్ 17 భాషల్లో 650కి పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. దిల్ చాహ్తా హై, కన్నత్తిల్ ముత్తమిట్టాల్, ఒక్కడు, గురు, కామినే, తుపాకి, కత్తి, తల్వార్, సైరా నరసింహారెడ్డి, ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్, ది గోట్ లైఫ్ తదితర చిత్రాలకు ఎడిటింగ్ అందించారు. ఆయనకు మొత్తం తొమ్మిది జాతీయ చలనచిత్ర పురస్కారాలు లభించగా, వాటిలో ఏడు ఉత్తమ ఎడిటర్ విభాగంలో దక్కడం ద్వారా ఆ విభాగంలోనే సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ గౌరవం దక్కడంతో సినీ ప్రముఖులు, దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఎడిటర్ శ్రీకర్‌కు ఆస్కార్ అకాడమీలో చోటు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 25, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)