mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మంచితనం, త్యాగాలకు ప్రతీక మొహరం : గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

-263 నిమిషాల క్రితం

AP Governor Abdul Nazeer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 05:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం విడుదల చేసిన సందేశంలో సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించిన పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ అమరత్వాన్ని మొహరం స్మరింపజేస్తుందని గవర్నర్ తెలిపారు. మంచితనం, త్యాగం, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలిచిన ఇమామ్ హుస్సేన్ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మొహరం నిజమైన అర్థం మంచితనం, త్యాగాన్ని స్మరించుకోవడమేనని, ఇది ఆత్మపరిశీలన, స్మరణ, ఆధ్యాత్మిక భక్తికి ప్రతీకగా నిలుస్తుందని వివరించారు.

త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక మొహర్రం

ముస్లిం సోదరులు పాటించే మొహరం.. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక అని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ పేర్కొన్నారు. మహ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీక అని ఆయన తెలిపారు. ఇస్లామిక్‌ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహరం అని గుర్తు చేశారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సామరస్యానికి, సమైక్యతకు అద్దం పడతాయని తన సందేశంలో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్