mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition2028 నాటికి మొదటి దశ పనులు పూర్తి

1 గంట క్రితం

Basavatarakam Cancer Hospital
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు పరిశీలించిన బాలకృష్ణ

ప్రజాశక్తి-తుళ్లూరు (గుంటూరు జిల్లా) : రాజధాని అమరావతి తుళ్లూరు సమీపంలో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటులు నందమూరి బాలకృష్ణ చెప్పారు. బసవతారం కేన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. హైదరాబాద్‌‌లో ఆస్పత్రి విస్తరణ పనులు, అమరావతిలోనూ బసవతారకం ఆస్పత్రి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయని, నిర్మాణం కోసం కార్మికులు పగలు, రాత్రి పని చేస్తున్నారని చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా నిర్మాణ పనులకు కొంత ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ప్రజలకు సేవచేయాలనే సంకల్పంతో నే రాజధాని అమరావతిలో ఆస్పత్రి నిర్మిస్తున్నామని బాలకృష్ణ చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్