సూపర్‌స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ చిత్రబృందం అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమాలో మహేశ్‌బాబు పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్‌ను విడుదల చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హాలీవుడ్ ప్రమోషన్ పేజ్ ‘X’లో ఈ స్టిల్స్‌ను షేర్ చేయగా.. చిత్రబృందం వాటిని రీపోస్ట్ చేసింది. స్టిల్స్‌లో మహేశ్‌బాబు స్టైలిష్, హ్యాండ్సమ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ ఫొటోలు ‘వారణాసి’ ఆఫ్రికా షెడ్యూల్‌కు సంబంధించినవేనని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.








కామెంట్‌లు (0)