న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం మూడో విడతలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఇప్పటి వరకు ఓటర్ల జాబితా నుంచి 1.5 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, ఒడిశా, మిజోరం, సిక్కిం, మణిపుర్, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, హర్యానా, ఛండీగఢ్, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలి, డామన్‌డయ్యూలో మూడో విడత ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టారు. వీటిలో 16 రాష్ట్రాలుండగా..మూడు కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. వీటిలో 12 చోట్ల ముసాయిదా జాబితా ప్రకటించగా..కొన్ని రాష్ర్టాల్లో గడువు పొడిగించారు. ఢిల్లీ, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో గడువు పొడిగించగా..త్రిపుర, నాగాలాండ్‌కు సంబంధించిన ముసాయిదాలు ఇంకా ప్రకటించాల్సివుంది. ముసాయిదా జాబితా ప్రకటించిన 12 రాష్ట్రాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 13,77,27,807గా పేర్కొనగా..1,58,59,834 (11.51శాతం) ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందుకు కారణంగా అందుబాటులో లేకపోవడం, ఇల్లు మారడం, మరణించడం వంటివి కారణంగా పేర్కొన్నారు. ఆంధ్రపదేశ్‌లో అత్యధికంగా 44.89 లక్షల పేర్లు (10.78శాతం) తొలగించడం విశేషం. దీంతో ఏపిలో ఓటర్ల సంఖ్య 4.16 కోట్ల నుంచి 3.71 కోట్లకు తగ్గిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో హర్యానాలో 33.83 లక్షలు, ఒడిశాలో 20.12 లక్షలు ఓట్ల తొలగింపులతో నిలిచాయి. ఇక అత్యల్పంగా సిక్కింలో 37,724 (8 శాతం) ఓట్ల తొలగింపులు జరగగా...మిజోరంలో 46,162 ఓటర్ల పేర్లు తొలగించారు.








కామెంట్‌లు (0)