ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసను తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్‌గా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన ఆయన, ఫిల్మ్ ఇండస్ట్రీకి, విద్యాసంస్థకు మధ్య వారధిగా పనిచేస్తూ సంస్థ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానన్నారు. విజయ్ నటించిన ‘స్నేహితుడు’, ‘బీస్ట్’, ‘లియో’, తెలుగులో ‘రేసుగుర్రం’, ‘రాధేశ్యామ్’, ‘గుంటూరు కారం’, ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ తదితర చిత్రాలకు మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. మనోజ్ నియామకాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.
ఎంజిఆర్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్‌గా మనోజ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 08:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)