ప్రజాశక్తి - పులివెందుల టౌన్ : మూడు రోజుల పర్యటనలో భాగంగా బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళవారం సాయంత్రం మాజీ సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. జగన్‌కు హెలిపాడ్ వద్ద కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్.అవినాష్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, కల్పలత రెడ్డి, మాజీ మంత్రి అంజాద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కోరుమట్ల శ్రీనివాసులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీగా వచ్చిన వైసిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగత సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఎటువంటి సేవలూ పేదలకు అందలేదని, దానివల్ల కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్లలేని పరిస్థితి అని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన స్పందిస్తూ కూటమి హామీల అమలుపై న్యాయ పోరాటం చేద్దామని అవసరమైతే నిరసనలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని వారికి భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, స్థానిక సమస్యల పరిష్కారానికి ముందుండాలని ముఖ్య నాయకులకు సూచించారు.
Print Editionబెంగళూరు నుంచి పులివెందులకు జగన్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 10:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)