mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’

3 గంటల క్రితం

idupu-kaayitham
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలంగాణ వాడుక భాషలో ‘ఇడుపు కాయితం’ అంటే విడాకులు అని అర్థం. గురువారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకుడు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ‘మన మూలాల సువాసన.. ప్రతి ఇంటి కథ’ అనే క్యాప్షన్‌తో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథగా ఈ చిత్రం రూపొందుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్