విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబలి’. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 1854 - 1878 మధ్య రాయలసీమ కరువు, బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే విప్లవాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. అయితే విడుదల వాయిదా పడే అవకాశాలపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దసరా సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Print Editionవాయిదా దిశగా ‘రణబలి’?
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)