mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​​తరగతుల కుదింపును ఉపసంహరించుకోవాలి

1 గంట క్రితం

school dharna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 10:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • విద్యార్థుల ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ, ఆదివాసీ గిరిజన సంఘం సంఘీభావం

ప్రజాశక్తి - బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా) : ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తరగతుల కుదింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీలు సంఘీభావం ప్రకటించాయి. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం లంకపాకల, పులిరామన్నగూడెంల్లోని ఆశ్రమ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు కీలకమని, తరగతులను కుదించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని అన్నారు. ఇప్పటికే ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తరగతుల కుదింపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి, అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు విద్యార్థుల చేయనున్న ఆందోళనకు ఎస్‌ఎఫ్‌ఐ, ఆదివాసీ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.నాగమణి, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారం భాస్కరరావు, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు అమూల్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్