mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత

1 గంట క్రితం

bhagya raj
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 10:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై: దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, లెంజడరీ దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్ కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఉన్న ఆయనకు శనివారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే స్పృహ తప్పి పడిపోవడంతో.. వైద్యులు అందించిన అత్యవసర చికిత్సలు ఫలించక ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

భాగ్యరాజ్ కేవలం నటుడిగానే కాకుండా.. అద్భుతమైన కథా రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా 1980ల కాలంలో ఆయన అందించిన ఫ్యామిలీ డ్రామాలు, సున్నితమైన హాస్యం, సామాజిక అంశాలతో కూడిన చిత్రాలు తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆయన రాసిన స్క్రీన్‌ప్లేలు ఎందరో వర్ధమాన దర్శకులకు పాఠాలుగా నిలిచాయి. భాగ్యరాజ్‌కు భార్య పూర్ణిమ (మాజీ నటి), కుమారుడు శంతను (నటుడు), కుమార్తె శరణ్య ఉన్నారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నటీనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ గాఢ సానుభూతిని ప్రకటిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్