ప్రజాశక్తి-కరప(కాకినాడ): కరప మండలం గురజానపల్లి పంచాయతీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. అడవిపూడి మెరకకు చెందిన చింతపల్లి వెంకటరమణ (60) శనివారం తెల్లవారుజామున తన పొలం విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటరమణ శనివారం తెల్లవారుజామున తన పొలం వద్దకు వెళ్లి పశువుల పని చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగలడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటనతో అడవిపూడి మెరక గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
కరెంటు షాక్‌తో రైతు దుర్మరణం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)