కార్తీ నటిస్తున్న ‘సర్దార్ 2’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ‘మిషన్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్’ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా తొలి భాగం కంటే మరింత యాక్షన్, ఉత్కంఠభరితమైన డ్రామా, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఇందులో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, శ్యామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నారు.
Print Editionసెప్టెంబరు 10న ‘సర్దార్ 2’
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 24, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)