సాక్రమెంటో : బిలియనీర్లపై పన్ను విధించే మొట్టమొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలవనుంది. మంగళవారం బ్యాలెట్ ప్రతిపాదన 40 కింద ఒక బిలియన్ డాలర్లకు మించిన నికర సంపద కలిగిన వారిపై 5శాతం పన్ను విధించనున్నట్లు ప్రతిపాదించింది. పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో 90 శాతం ఆరోగ్య సంరక్షణకు, మిగిలిన 10 శాతం విద్య, ఆహార సహాయ కార్యక్రమాలు, పన్ను నిర్వహణకు వినియోగించాలని ప్రతిపాదించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా నవంబర్ 3న కాలిఫోర్నియాలో జరిగిన ఓటింగ్‌లో బిలియనీర్లపై సంపద పన్ను విధించాలన్న ప్రతిపాదనను కూడా ఓటర్ల ముందుంచనున్నారు. అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణకు కేటాయించే నిధుల్లో కోతలు పడుతున్న నేపథ్యంలో, ఆ లోటును భర్తీ చేసేందుకు ఈ పన్ను అవసరమని మద్దతుదారులు వాదిస్తున్నారు. రానున్న ఐదేళ్లలో కాలిఫోర్నియా ఆరోగ్య సంరక్షణ రంగం సుమారు 100 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపాదనకు మద్దతిస్తున్న కార్మిక సంఘం ఎస్‌ఈఐయూ యునైటెడ్ హెల్త్‌కేర్ వర్కర్స్ వెస్ట్ అంచనా వేస్తోంది. అమెరికా సెనేటర్ బెర్నీ శాండర్స్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. సంపద అసమానతలను తగ్గించేందుకు ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. అయితే, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ సహా పలువురు డెమోక్రటిక్ నేతలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. అధిక పన్నుల కారణంగా సంపన్నులు రాష్ట్రం విడిచి వెళ్లే అవకాశం ఉందని, తద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయపు పన్ను రాబడులు తగ్గి బడ్జెట్‌పై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్డ్ పేరెంట్‌హుడ్, కాలిఫోర్నియా టీచర్స్ అసోసియేషన్ వంటి సంస్థలు కూడా పన్ను ఆదాయ వినియోగం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.








కామెంట్‌లు (0)