తొలిసారి ప్రకటించిన అమెరికా
రోదసిలో యుద్ధ సన్నాహాలు వద్దన్న చైనా
వాషింగ్టన్ : యుద్ధోన్మాదంతో ఊగిపోయే అమెరికా అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరిం పజే సింది. ఈ విషయాన్ని తొలిసారిగా అంగీకరిం చింది. శత్రు దేశాల చర్యలకు వ్యతిరేకంగా సంయు క్త దళాలను కాపాడగలిగే సామర్ధ్యమున్న అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు అమెరికా వద్ద వున్నాయని అమెరికా స్పేస్ ఫోర్స్ ప్రతినిధి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఆ ఆయుధాలకు సం బంధించిన నిర్దిష్ట సమాచారమేది ఆయన అందించ లేదు. ప్రధానంగా భౌగోళిక, రాజకీయ ప్రత్యర్ధులైన రష్యా, చైనాలే రోదసీలోనూ అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించిన దేశాలని, అందుకే రోదసిలో ఆయుధాలు మోహరించామని తెలిపారు. అమెరికా ప్రకటనను చైనా తీవ్రంగా ఖండిం చింది. అంతరిక్షంలోనైనా యుద్ధ సన్నా హాలను ఆపేయాలని హితవు పలికింది. రోదసీని కూడా ఆయు ధాలతో నింపేయవద్దని, కదనరంగంగా మార్చవద్దని కోరింది. దీనివల్ల అక్కడ కూడా ఆయుధ పోటీ నెలకొంటుందని సైనిక ప్రతినిధి గుయో జియాకున్ పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)