మంగళవారం, 15 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెట్టులేని పిట్టలు

1 గంట క్రితం

tree.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 03:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఈ చెట్టే..

పిట్టల్లాంటి పిల్లలకు

పాఠాలు చెప్పేటపుడు

తరగతి గదిలా మారిపోయి

తల్లి ఒడిలా మారింది...

​ఈ చెట్టే..

బడి కార్యక్రమాలకు

రంగస్థల వేదికై

మురిపించింది...

​ఈ చెట్టే..

ఎండా వానల నుండి

పిల్లల ఆకలి తీర్చే

వంటమ్మలకు

గూడై ఆదుకున్నది...

​ఈ చెట్టే..

సాయంత్రం ఆటపాటల్లో

పిల్లల కేరింతలకు

ఆలంబనయి

నిటారుగా నిలబడింది...

​ఊరి

వూరి పెత్తందారు

కళ్లబడి

చెట్టు మాయమై

బడి అంతా బోసిపోయింది...

​పిల్లలు

చెట్టులేని పిట్టలై..

విలవిల

కొట్టుకుంటున్నారు...

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్