ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగులుతుందంటున్న విశ్లేషకులు
పోరాడుతున్న రిపబ్లికన్లు, డెమొక్రాట్లు
వాషింగ్టన్ : అమెరికాలో కీలక మధ్యంతర ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 3.30 గంటలకు వర్మంట్ రాష్ట్రంలో తొలుత పోలింగ్ మొదలైంది. ఆ తర్వాత 4.30 గంటలకు న్యూజెర్సీ, వర్జీనియా, కనెక్టికట్, కెంటుకీ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య జార్జియా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, న్యూయార్క్ రాష్ట్రాల్లో పోలింగ్‌ను ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటలకు ఓహియో, నార్త్ కరోలియా రాష్ట్రాల్లో పోలింగ్‌ను మొదలు పెట్టారు. సాయంత్రం ఐదున్నర గంటలకు మిచిగాన్ రాష్ట్రంలో పోలింగ్ మొదలైంది. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జార్జియా, ఇండియానా, కెంటుకీ, సౌత్ కరోలినా, వర్జీనియా, వర్మంట్‌లో పోలింగ్ ముగుస్తుంది. ఆరు గంటలకు నార్త్ కరోలినా, ఓహియో, వెస్ట్ వర్జీనియాలోనూ, ఆరున్నరకు ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, మాసాచూసెట్స్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, మిస్సోరీ తదితర 16 రాష్ట్రాల్లోనూ, ఉదయం 7.30 గంటలకు టెక్సాస్, అరిజోనా, కొలరాడో, మిన్నెసోటా, విస్కాన్సిన్, న్యూయార్క్, మిచిగాన్‌లోనూ, ఉదయం 8.30 గంటలకు నెవాడా, మోంటానా, ఉటాలోనూ, ఉదయం 9.30 గంటలకు కాలిఫోర్నియా, వాషింగ్టన్, ఐడహÃ, ఒరెగాన్‌లోనూ, ఉదయం 10.30 గంటలకు హవాయిలోనూ పోలింగ్ ముగుస్తుంది. ఉదయం 11.30 గంటలకు అలస్కాలో ముగిసే పోలింగ్‌తో ప్రక్రియ పూర్తవుతుంది.
ఆందోళన కలిగిస్తున్న జీవనవ్యయం, యుద్ధాలు
రిపబ్లికన్ పార్టీ పైన, దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు పైన అమెరికా ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పలు పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. యుద్ధాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జీవనవ్యయం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.








కామెంట్‌లు (0)