బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పూణే కోర్టు వెలుపల వ్యక్తిపై కత్తులతో దాడి

24 నిమిషాల క్రితం

attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 04:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తీవ్ర గాయాలు

పూణే: మహారాష్ట్రలోని పూణేలో జిల్లా, సెషన్స్ కోర్టు ఆవరణ వెలుపల ఓ వ్యక్తిపై 4-5 మంది దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో శివాజీనగర్ కోర్టు వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. మందర్ కివ్డే అనే వ్యక్తిపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితుడికి తుపాకీ గాయాలేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దాడికి పాల్పడిన అనుమానితుల పేర్లను గుర్తించామని, వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. కాగా, బాధితుడు మందర్ కివ్డేపై 2025లో హత్య కేసు నమోదైందని, ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడని పూణే నగర పోలీసులు వెల్లడించారు. ఈ దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్