సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లండన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ-యుకె నిరసన: జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్

1 గంట క్రితం

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా - యుకే (SFI-UK) విభాగం లండన్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 08:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

లండన్:

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా - యుకే (SFI-UK) విభాగం లండన్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. భారత్‌లో ఆందోళనలు నిర్వహిస్తున్న తోటి విద్యార్థి నాయకులు, కార్యకర్తలపై పోలీసులు సాగిస్తున్న అణచివేత చర్యలకు నిరసనగా ఈ ప్రదర్శన నిర్వహించారు.


"జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.. విద్యార్థి నాయకులపై దాడులను ఉపేక్షించేది లేదు" అంటూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. చేతుల్లో సంఘం జెండాలు పట్టుకుని పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొన్నారు.


ఓటర్ల జాబితాలో అక్రమాలు, అక్రమ తొలగింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు సిఇఒ రాజీనామాను డిమాండ్ చేస్తూ పోరాడుతున్నాయి. ఢిల్లీలో నిరసనకారులపై కేంద్ర బలగాలను ఉపయోగించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆరోపించారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు.


వామపక్ష నాయకులు, విద్యార్థి-యువజన పోరాట యోధులను రోడ్లపై ఈడ్చుకెళ్లి, పోలీసు వాహనాల్లో వేసి విచక్షణారహితంగా దాడి చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై జరుగుతున్న ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, భారత్‌లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా లండన్‌లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్‌ఎఫ్‌ఐ-యుకె స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్