సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీలో మిన్నంటిన నిరసనలు.. ఇండియా కూటమి భేటీకి ‘సిజేఐ’ నిరాకరణ!

1 గంట క్రితం

భేటీ అయ్యేందుకు  'ఇండియా' కూటమి ప్రతినిధుల బృందం చేసిన విజ్ఞప్తిని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ తోసిపుచ్చారు.

భేటీ అయ్యేందుకు 'ఇండియా' కూటమి ప్రతినిధుల బృందం చేసిన విజ్ఞప్తిని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ తోసిపుచ్చారు.

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 09:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ:

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని న్యూఢిల్లీలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ‘సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ (CJP)తో పాటు పలు విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనలతో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


మరోవైపు, ఈ అంశంపై భేటీ అయ్యేందుకు 'ఇండియా' కూటమి ప్రతినిధుల బృందం చేసిన విజ్ఞప్తిని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ తోసిపుచ్చారు.


ఎన్నికల కమిషన్ తీరు మరియు నిరసనలపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కోరిన ఇండియా కూటమి నేతలకు సిజేఐ ఆఫీస్ రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. సదరు అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, పరిపాలనాపరమైన అంశాల్లో సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకోలేదని స్పష్టం చేస్తూ అపాయింట్‌మెంట్‌ను నిరాకరించింది.


ఢిల్లీలో ఆంక్షలు.. మెట్రో స్టేషన్లు మూసివేత


ఆందోళనకారులు సుప్రీంకోర్టు వైపు మార్చ్ నిర్వహించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యగా పటేల్ చౌక్, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, జనపథ్, బారాఖంబా రోడ్డు తదితర 6 కీలక మెట్రో స్టేషన్లలో ప్రవేశాలు, నిష్క్రమణలను సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిలిపివేశారు. ల్యుటియన్స్ ఢిల్లీ ప్రాంతంలో భాగాలుగా ట్రాఫిక్ మళ్లింపులు విధించి, భద్రతా బలగాలను భారీగా మోహరించారు.


పలు ప్రాంతాల్లో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. శాంతియుతంగా నిరసన తెలిపే పౌరులను చట్టవిరుద్ధంగా నిర్బంధించకూడదని అధికారులను ఆదేశించింది. అయినప్పటికీ జంతర్ మంతర్, కొనాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో పలువురు ఆందోళనకారులను పోలీసులు భద్రతా బస్సుల్లో తరలించారు.


ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్